దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైనప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో అడపా దడపా వైరస్ బాధితులు పెరుగుతున్నారు. కేరళలో ఒక్కరోజే 5,397 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. 4,506 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
కేరళలో మరో 5వేల కేసులు- ధారావిలో సున్నా - Covid-19 cases in Maharashtra
దేశంలో కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో 5 వేలకు పైగా కొవిడ్ కేసులు బయటపడగా.. మహారాష్ట్రలో 3 వేలకు పైగా వెలుగుచూసాయి. అయితే ముంబయిలో ధారావిలో తొలిసారిగా ఒక్క కేసు కూడా నమోదవలేదు.
![కేరళలో మరో 5వేల కేసులు- ధారావిలో సున్నా 5,397 new COVID19 cases and 4,506 recoveries reported in #Kerala today.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10008176-thumbnail-3x2-covid-19.jpg)
కేరళలో మరో 5వేల కరోనా కేసులు- ధారావిలో జీరో!
మహారాష్ట్రలో తాజాగా 3,431 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముంబయిలోని ధారావి మురికివాడలో శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కరోనా విస్తరణ ప్రారంభమైన నాటి నుంచి రోజూ ఒక్కరైన వైరస్ బారిన పడే ధారావిలో.. గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 1,031 మందికి కరోనా సోకింది. మరో 12 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 36 వేలు దాటింది.
- కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,005 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 5 మరణించారు.
- దిల్లీలో తాజాగా 758 కొవిడ్ కేసులు వెలుగుచూడగా.. 30 మంది మృతి చెందారు. 1,370 మంది కోలుకున్నారు.
- పంజాబ్‌లో తాజాగా 320 మందికి వైరస్ సోకగా.. 9 మంది చనిపోయారు.
ఇదీ చూడండి:అంబులెన్స్‌లో గుండె- 12నిమిషాల్లో 18కి.మీ ప్రయాణం