రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా కల్వా గ్రామంలో భారీ సంఖ్యలో నెమళ్లు మృతి చెందాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 53 నెమళ్లు మృతిచెందగా మరో 26 గాయపడ్డాయి. నెమళ్ల మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనపై గ్రామసర్పంచ్ సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.
శవపరీక్షలు నిర్వహించామని, ఫలితాలు వచ్చే వరకూ ఈ ఘటనపై స్పష్టత ఇవ్వలేమని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. మృతిచెందిన నెమళ్లను నాగౌర్ జిల్లా ఎస్పీ దీద్వన సంజయ్ గుప్తా, అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఖననం చేశారు.