NOTES DROPPED FROM AUTO: ధనం మూలం ఇదం జగత్.. అంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. వాళ్లని మనం చూస్తూనే ఉన్నాం. అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే పెద్ద వాళ్లు ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బుతోనే ఈ ప్రపంచ నడుస్తోంది అని అర్థం.
మరి అలాంటి డబ్బు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యం ఉంటుంది. నేటీ సమాజంలో బంధుత్వాల కన్నా ధనానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. వస్తువు నుంచి మనుషుల వరకూ దేనినైనా కొనుగోలు చేయాలంటే కావాల్సింది డబ్బు. మరి అలాంటి డబ్బు గాలిలో ఎగురుకుంటు వస్తే.. ఎవరైనా దాని కోసం ఆశపడతారు. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
జిల్లాలోని నరసన్నపేట మండలం మడపం టోల్గేట్ వద్ద ఓ ఆటోలో నుంచి 500 రూపాయల నోట్లు గాలిలోకి ఎగిరాయి. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న ఓ ఆటో టోల్గేట్ వద్దకు ఫుల్స్పీడ్లో వచ్చింది. ఈ క్రమంలోనే ఆటోలో ఉన్న 500 రూపాయల నోట్లు గాలిలోకి ఎగిరాయి. గమనించిన టోల్ గేట్ సిబ్బంది జాతీయ రహదారిపై పడి ఉన్న 500 రూపాయల నోట్లను సేకరించారు. అయితే ఆటో కంటే ముందు ఒక ద్విచక్ర వాహనం ప్రయాణించినట్టు సిబ్బంది గుర్తించారు.