కరోనాను అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో.. ముంబయికి వచ్చే కార్మికులను నియంత్రించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలు, హోలీ వంటి కారణాలతో తమ సొంత రాష్ట్రాలకు బయల్దేరిన కూలీలు.. ముంబయికి బాట పట్టారు. ఇలా.. రోజుకు సుమారు 50వేల మంది నగరానికి చేరుకుంటున్నారు.
ప్రస్తుతం.. ఉత్తర్ప్రదేశ్, బిహార్, బంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న తరుణంలో.. అక్కడి నుంచి ప్రజలు తరలిరావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని ఠాక్రే ప్రభుత్వం స్పష్టం చేసినా.. వీళ్లు మాత్రం ఎలాంటి టెస్ట్లు లేకుండానే ముంబయిలోకి ప్రవేశిస్తున్నారు.
ఇదీ చదవండి:మహాలో 50 లక్షలకు చేరువలో కరోనా కేసులు
మధ్య, పశ్చిమ రైల్వే వివరాలు:
- ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల ముంబయిలో అంతర్రాష్ట్ర రైళ్లు రద్దయినప్పటికీ.. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, బంగాల్ నుంచి వచ్చే రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
- ప్రయాణికుల సంఖ్య పెరిగినందున.. సాధారణ రైళ్లతో పాటు కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది రైల్వే. ఈ నాలుగు రాష్ట్రాల నుంచి రోజుకు మొత్తం 55 రైళ్లు ముంబయికి వస్తున్నాయి. ప్రతి రైల్లోనూ సుమారు 60 శాతం నుంచి 75 శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి.
- రోజుకు సగటున మధ్య రైల్వే ద్వారా సుమారు 32వేల మంది, పశ్చిమ రైల్వే ద్వారా 18వేల మంది కార్మికులు ముంబయికి విచ్ఛేస్తున్నారు.
కార్మికులరాకతో ముంబయిలో కొవిడ్ కేసులు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే.. ఆ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నందున ఇంకా పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:దేశంలో 4లక్షల కరోనా కేసులు- 4వేల మరణాలు