ఉత్తర్ప్రదేశ్లో దాదాపు 5వేల మదర్సాలను మూసివేస్తున్నట్లు(madrasa closed) రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యుడు సురేశ్ జైన్ వెల్లడించారు. నిబంధనలు పాటించకపోవడం వల్లే వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఏటా రూ.100కోట్ల ఆదాయం మిగులుతుందని చెప్పారు.
మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సురేశ్ జైన్ అన్నారు. 'సబ్కా సాత్ సబ్కా వికాస్' నినాదంతో యోగి సర్కారు(Yogi Adityanath) పనిచేస్తోందని చెప్పారు.