5000 KM Cycling in 100 Days :ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఓ వృద్ధుడు. 63 ఏళ్ల వయసులో 5000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 100 రోజుల్లోనే ఈ ఘనతను అందుకున్నారు.
India Book of Record in Cycling : కర్ణాటక హుబ్బళ్లికి చెందిన గురుమూర్తి వృత్తిరీత్యా ఛార్టెడ్ అకౌంటెంట్. ఆయనకు చిన్ననాటి నుంచి క్రీడలంటే అమితమైన ఆసక్తి. 60 ఏళ్లు వచ్చేవరకు క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ ఆడిన గురుమూర్తికి.. కొద్దికాలం క్రితం కాలి గాయమైంది. ఫలితంగా క్రీడలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా వ్యాయామం చేయాలని భావించిన గురుమూర్తి.. సైక్లింగ్‌ను ప్రారంభించారు.
మొదట్లో ఆరోగ్యం కోసం ఇంటి సమీపంలోనే సైకిల్ తొక్కడం ప్రారంభించిన గురుమూర్తికి.. ఆ తర్వాత అదే ఆసక్తిగా మారిపోయింది. హుబ్బళ్లి సైకిల్ క్లబ్లో చేరిన ఆయన అనేక అవార్డులను సాధించారు. ఈ క్రమంలోనే మే 11 నుంచి ఆగస్టు 18 వరకు రోజుకు 50 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. రోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు సైకిల్ తొక్కి ఈ ఫీట్‌ను సాధించారు.
"గురుమూర్తి సాధించిన ఈ అవార్డు ప్రస్తుత తరానికి ఎంతో ఆదర్శం. ఈ రికార్డ్ సాధించడం అంత సులభం కాదు. తెల్లవారుజామున 4 నుంచి 8 గంటల వరకు నిర్విరామంగా 100 రోజులు సైకిల్ తొక్కారు. ఆయన కష్టానికి ఫలితమే ఈ రికార్డ్. ఆయన సైకిల్ తొక్కిన టెండర్ రోడ్ పేరును గురుమూర్తి రోడ్డుగా మార్చితే బాగుంటుంది."
--సుబ్రమణ్య, సైకిల్ క్లబ్ సభ్యుడు