పెగసస్ నిఘా వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణకు 500 మందికి పైగా వ్యక్తులు, సంస్థలు లేఖ రాశాయి. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓకు చెందిన ఈ స్పైవేర్‌ను భారత్‌లో విక్రయం, బదిలీ, వినియోగంపై మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేశాయి.
మహిళా విద్యార్థిణులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, లాయర్లు, లైంగిక హింస బాధితులపై నిఘా కోసం స్పైవేర్‌ను వినియోగించారనే కథానాలపై వారు విస్మయం వ్యక్తంచేశారు. లింగ భేదాల్లేని, సమాచార భద్రత, వ్యక్తిగత గోపత్య విధానాన్ని అనుసరించాలని కోరారు.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వ్యక్తిపై ఈ సాఫ్ట్వేర్ ద్వారా నిఘా ఉంచారనే ఆరోపణలను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు.