ఈయన 'స్కెచ్' వేస్తే నేరస్థులకు వణుకే ఆయన 'స్కెచ్' వేశారంటే ఎలాంటి నేరస్థులైనా పోలీసుల వలలో చిక్కాల్సిందే.. నిందితుల ఆనవాళ్లు చెబితే చాలు.. వారి ముఖాలను అచ్చు గుద్దినట్లు దించేస్తారాయన.. ఇప్పటివరకు 500 మంది నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేశారు... ఆయనే క్యారికేచర్ ఆర్టిస్ట్ నితిన్ యాదవ్..
నేరస్థులను పట్టుకోవాలంటే పోలీసులు ముందుగా సంప్రదించేది నితిన్ యాదవ్‌నే. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన నితిన్.. ఇప్పటివరకు 4 వేలకు పైగా స్కెచ్‌లు గీశారు. నేరం చేసేటప్పుడు నిందితులు చిన్నసాక్ష్యం వదిలినా.. నితిన్ చేతిలోనుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పోలీసులు గుర్తుపట్టలేని కేసుల్లోనూ.. ఆయన పక్కాగా వారి ముఖాలను గీసేస్తారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పే కొన్ని వివరాలతోనే నిందితుల ఫొటోలను గీస్తారు.
కొన్నిసార్లు నేరస్థులు ఫోన్ చేసి నితిన్‌ను బెదిరించినా ఆయన భయపడలేదు. పట్టుదలతో ఇప్పటికీ నేరస్థుల వేటలో పోలీసులకు సాయపడుతున్నారు. 2013లో ముంబయిలో సంచలనం రేపిన శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసును ఛేదించేందుకు పోలీసులు నితిన్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో నితిన్ గీసిన స్కెచ్‌ల ద్వారానే నిందితులను పట్టుకున్నారు. 2012లో బాంద్రాలో విదేశీ యువతిపై జరిగిన అత్యాచార కేసును, 2010లో పుణెలోని జర్మన్ బేకరీ బాంబు దాడి కేసులోనూ నితిన్ సాయం వల్లే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
"నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం. 2008లో ఫొటోగ్రాఫర్లను కోర్టులోకి ప్రవేశించేందుకు అనుమతించనప్పుడు ఓ స్థానిక పత్రిక కోసం ఉగ్రవాది అజ్మల్ కసబ్.. ఫొటోను గీశాను. ఇలానే ఓ ప్రముఖ హోటల్లో జరిగిన హత్య కేసును, 2013లో గ్యాంగ్ రేప్ కేసును నేను గీసిన ఫొటోల ద్వారానే పోలీసులు ఛేదించారు. ఇప్పటివరకు సుమారు 500 మంది నేరగాళ్లను పోలీసులు నా స్కెచ్‌ల ద్వారా పట్టుకున్నారు."
--నితిన్ యాదవ్
చిన్నతనంలోనే తన తల్లి నుంచి స్కెచ్ వేయడం నేర్చుకున్నారు నితిన్ యాదవ్. ఆయన తండ్రి నేత కార్మికుడు. మిల్లు కార్మికుల కోసం రాసే హోర్డింగ్‌లను తన చేతిరాతతో, స్కెచ్‌తో అందంగా తీర్చిదిద్దేవారు నితిన్. నితిన్ యాదవ్ తండ్రి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన చిహ్నాలను, స్లోగన్లను రాసేవారు. పాఠశాల దశలోనే నితిన్ డ్రాయింగ్ ప్రతిభను చూసి ఉపాధ్యాయులు ముగ్ధులయ్యారు. ఆయనను ప్రోత్సహించారు.
నితిన్ యాదవ్ తీర్చిదిద్దిన కళాఖండాలు నితిన్ యాదవ్ తీర్చిదిద్దిన కళాఖండాలు నితిన్.. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అక్కడే ప్రొఫెసర్‌గా పనిచేశారు. నేరస్థుల క్యారికేచర్లే కాక ఇతర చిత్రాలను అద్భుతంగా గీసే ప్రతిభ ఆయన సొంతం. ఇప్పటివరకు నితిన్ 164 అవార్డులను గెలుచుకున్నారు.
నితిన్ యాదవ్ తీర్చిదిద్దిన కళాఖండాలు నితిన్ యాదవ్ తీర్చిదిద్దిన కళాఖండాలు