తెలంగాణ

telangana

ETV Bharat / bharat

56 ఏళ్ల వయసులో రెండు బావులు తవ్విన మహిళ - 56 ఏళ్ల వయసులో బావులు తవ్విన మహిళ సాహసం

పట్టుదల, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి పెద్ద పెద్ద వాళ్లను, వారి విజయాలనే ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త స్మార్ట్‌ఫోన్ పక్కనబెట్టి చూస్తే.. మన చుట్టుపక్కల సైతం ఎంతోమంది కనిపిస్తారు. సాధారణ వ్యక్తులు కూడా దృఢ సంకల్పానికి పట్టుదల, నిరంతర శ్రమ జోడిస్తే.. అద్భుతాలు చేయవచ్చనేదానికి నిదర్శనంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన గౌరీ చంద్రశేఖర్ నాయక్.

50 year old woman digs 2 wells in her old age!
అవును.. ఆమె చేతులు అద్భుతం చేశాయి!

By

Published : Mar 28, 2021, 9:08 AM IST

Updated : Mar 28, 2021, 3:33 PM IST

56 ఏళ్ల వయసులో రెండు బావులు తవ్విన మహిళ

50ఏళ్లు నిండాయంటే చాలు తమ పని అయిపోయిందనుకుంటారు చాలామంది. అయితే పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించొచ్చని నిరూపించిందో 56 ఏళ్ల మహిళ. ఐదుపదుల వయసులోనూ ఎవరి సాయం లేకుండా నీటి బావులు తవ్విందామే. వక్క సాగుకోసం బావులు తవ్విన ఆమె కృషిని స్థానికులు కొనియాడుతున్నారు. కర్ణాటకలోని గౌరి చంద్రశేఖర్ నాయక్ ఈ ఘనత సాధించింది.

బావిలోకి దిగుతోన్న గౌరీ చంద్రశేఖర్ నాయక్ ..
గౌరీ చంద్రశేఖర్ నాయక్

అన్నీ తానై..

గౌరీ చంద్రశేఖర్ నాయక్ ఉత్తర కర్ణాటకలోని షిర్సిపట్టణవాసి. వయస్సు యాభై ఆరేళ్లు. ఈ వయసులోనూ.. అవలీలగా రెండు బావులు తవ్వేశారు. మట్టి తవ్వడం దగ్గర నుంచి, తీయడం వరకూ తానొక్కతే శ్రమించి.. దాదాపు అరవై అడుగుల లోతుండే రెండు బావులను తవ్వారు. ఒక్కొక్క బావి తవ్వేందుకు ఆమెకు పట్టిన సమయం నాలుగు నుంచి ఐదు నెలలు.

తాను తవ్విన బావిలో నీరు చేదుతూ గౌరీ చంద్రశేఖర్ నాయక్....

ఇదీ చదవండి:మూర్తీభవించిన మానవత్వం.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై

ఇదీ చదవండి:పోలీసు చొరవ, బైకర్​ సాహసంతో బామ్మకు మందులు

వక్క సాగు కోసమే..

గౌరి తన పెరట్లో సాగు చేస్తున్న వక్క చెట్లకు నీరు తక్కువైంది. దీంతో నీటి కోసం బావి తవ్వాలని నిర్ణయించిన ఆమె తన ఇంటి వెనుకన ఉన్న ఖాళీ స్థలంలో ఎవరి సహాయం లేకుండానే రాత్రీపగలు శ్రమించి ఈ బావులు తవ్వారు. లాక్‌డౌన్ సమయం కంటే ముందు ఓ బావి తవ్విన గౌరి లాక్‌ డౌన్‌ సమయంలో మరో బావి నిర్మాణాన్ని పూర్తిచేశారు.

గౌరీ చంద్రశేఖర్ నాయక్ తవ్విన బావిలో నీటి కళకళ..

ఐదుపదుల వయసులో గౌరి చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి స్థానికులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం సైతం ఆమె పట్టుదలను, కృషిని కొనియాడింది.

గౌరీ చంద్రశేఖర్ నాయక్ తవ్విన మరో బావి..

ఇదీ చదవండి:ఆ ఇల్లు అందమైన చిత్రాలు నిండిన పొదరిల్లు

4000 కి.మీ పాదయాత్రతో కరోనా యోధులకు సలాం!

Last Updated : Mar 28, 2021, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details