తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో 50 లక్షల మంది మృతి' - కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. అది కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలవల్లేనని మండిపడ్డారు.

Covid deaths
కరోనా మరణాలు

By

Published : Jul 21, 2021, 10:39 PM IST

కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల కొవిడ్​-19 రెండో దశలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. అయితే.. కరోనా కారణంగా దేశంలో 4.18 లక్షల మరణాలు సంభవించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కరోనా మరణాలపై ట్విట్టర్​ వేదికగా ఆరోపణలు చేశారు రాహుల్​ గాంధీ. 2021, జూన్​ వరకు కరోనా మరణాలపై సెంటర్​ ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్​ నివేదికను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

రాహుల్​ గాంధీ ట్వీట్​

" ఇదే నిజం.. కొవిడ్​ రెండో ఉద్ధృతిలో భారత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో మన చెల్లెళ్లు, సోదరులు, తల్లులు, తండ్రులు సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు" అని రాసుకొచ్చారు రాహుల్​.

ఇదీ చూడండి:viral video: నమస్తే పెట్టలేదని కర్రలతో దాడి

ABOUT THE AUTHOR

...view details