తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం - చిన్నారిపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

5 year old raped in up, చిన్నారిపై అత్యాచారం
ఉత్తర్​ప్రదేశ్​లో అత్యాచారం

By

Published : Apr 7, 2021, 4:02 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. దీనిపై చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు.. బాధితురాలి తండ్రితో పాటే ఓ ఇటుక బట్టీలో పనిచేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు.

ఇటుక బట్టీ సమీపంలోనే చిన్నారిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా.. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

ఇదీ చదవండి :మావోల బందీలో ఉన్న జవాన్​ ఫొటో విడుదల!

ABOUT THE AUTHOR

...view details