తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2022, 12:33 PM IST

ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. బాలిక పరిస్థితి విషమం

Girl raped in Puri: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని పూరీలో జరిగింది.

rape
చిన్నారిపై అత్యాచారం

Girl raped in Puri: ఒడిశాలోని పూరీలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఇంటి పక్కన ఉంటే ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా కటక్​లోని ఎస్​సీబీ ఆసుపత్రిలో చేర్చించినట్లు పేర్కొన్నారు.

చిన్నారి.. పూరీలోని ఓ అద్దె ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఉండేది. నిందితుడు మహేశ్​ మహంతి కూడా అదే బజార్​లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబం ఇంటికి తరుచూ వచ్చి వెళ్లేవాడు. ఇలా వచ్చిన మహేశ్​ ఇంట్లో ఎవరూ లేరని గమనించి చిన్నారిని డాబా మీదకు తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. మహేశ్​ అక్కడ నుంచి పారిపోవడం స్థానికులు చూసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details