మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా బోయిసార్ ప్రాంతంలో ఓ ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. కడపునొప్పితో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించగా ఈ విషయం బయటపడింది. పోలీసులు చిన్నారిని ఆరా తీయగా.. ఓ 12 ఏళ్ల అబ్బాయి అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిసింది.
నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని, జువైనల్ హోమ్‌కు తరలిస్తామని చెప్పారు.
ముంబయిలో ఏడేళ్ల చిన్నారిపై..
ఇటువంటి ఘటనే ముంబయిలో జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నందుకుగాను ఓ 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఆశ చూపి గత కొద్ది రోజులుగా చిన్నారిని లైంగికంగా వేధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 సహా పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో..
పాఠాలు చెప్పే పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా పుర్కాజీ ప్రాంతంలో జరిగింది. కంప్యూటర్ క్లాసులు కోసం వచ్చే ఓ 16 ఏళ్ల దళిత బాలికను (dalit rape victim) నిందితుడు సోమవారం అత్యాచారం చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ, ఎస్సీ/ఎస్టీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదైంది.
ముజఫర్‌నగర్ జిల్లాలోనే మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసుల వివరాల ప్రకారం..
ఇంటికి తిరిగి వస్తున్న బాధితురాలిపై పర్వేజ్ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను బెదిరించాడు. ఘటనాస్థలం నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి :నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్లో వీడియో తీసి...