మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.
ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.
ఇదీ జరిగింది
ఆ చిన్నారి.. రొట్టెను కొనేందుకు తన ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అయితే గంటన్నర దాటినా ఇంకా ఇంటికి వెళ్లలేదు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. కానీ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఆ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. చోటూ తోమర్ అనే వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో స్థానికులంతా తోమర్ ఇంటికి వెళ్లారు. అక్కడే విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.