తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మినీ సార్వత్రికం కౌంటింగ్​కు సర్వం సిద్ధం.. విజేతలు ఎవరో? - ఉత్తర్​ప్రదేశ్ ఓట్ల లెక్కింపు

5 states election counting: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం... కేంద్ర ఎన్నికల సంఘం విస్త్రత ఏర్పాట్లు చేసింది. దేశ ప్రజంలదరి దృష్టి..అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌పైనే కేంద్రీకృతమైంది. భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని... మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. పంజాబ్‌లో అధికార మార్పిడి ఖాయమని, ఆమ్‌ఆద్మీ జయభేరి మోగిస్తుందని పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లో పోటాపోటీ ఉంటుందని తెలిపాయి.

5 states election counting
5 states election counting

By

Published : Mar 9, 2022, 4:30 PM IST

5 states election counting: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

UP election counting:

మొత్తం 403 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఏర్పాటుచేసినట్లు వివరించింది.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా

  • భాజపా- 312
  • సమాజ్‌వాదీ పార్టీ 47
  • బీఎస్పీ- 19
  • అప్నాదళ్‌ ఎస్- 9
  • కాంగ్రెస్‌- 7

ఎగ్జిట్ పోల్స్ ఇలా...

యూపీ ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. సమాజ్‌వాదీ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తెలిపాయి. అయితే 2017 ఎన్నికలతో పోలిస్తే తన బలాన్ని పెంచుకుంటుందని పేర్కొన్నాయి.

యూపీ ఎగ్జిట్ పోల్స్

పంజాబ్​లో

పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 66 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 1,304 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా...

  • కాంగ్రెస్‌- 77
  • ఆమ్ఆద్మీ- 20
  • అకాలీదళ్‌-భాజపా కూటమి 18
  • లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ- 2

ఎగ్జిట్ పోల్స్

తాజా ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, అకాలీదళ్‌ నేతలు ఎవరికివారే ధీమాగా ఉన్నారు. అయితే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం..అధికార కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని, ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనావేశాయి.

పంజాబ్ ఎగ్జిట్ పోల్స్

ఉత్తరాఖండ్...

ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగ్గా... ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 13 జిల్లాల పరిధిలో కౌంటింగ్‌కు... ఈసీ ఏర్పాట్లు చేసింది. ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో 632 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

2017 ఎన్నికల్లో ఇలా..

  • భాజపా- 57
  • కాంగ్రెస్‌- 11
  • స్వతంత్రులు- 2

ఎగ్జిట్ పోల్స్...

ఉత్తరాఖండ్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఎగ్జిట్‌పోల్స్ సైతం స్పష్టంగా ఏ పార్టీకీ మెజార్టీ కట్టబెట్టలేదు. ఫలితంగా... ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్

గోవా అసెంబ్లీలో 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగ్గా... గురువారం ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 332 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనా ప్రకారం గోవాలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. హంగ్‌ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి.

2017లో ఇలా..

  • కాంగ్రెస్‌- 17
  • భాజపా- 13
  • ఇతర పార్టీలు- 10

ఎగ్జిట్ పోల్స్...

గోవా ఎగ్జిట్ పోల్స్

మణిపుర్

మణిపుర్‌ అసెంబ్లీలో 60 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. అక్కడ కూడా గురువారమే ఫలితాలు వెలువడనున్నాయి. రెండు విడతల్లో కలిపి 265 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మణిపుర్‌లో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి.

ఎగ్జిట్ పోల్స్..

మణిపుర్ ఎగ్జిట్ పోల్స్

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details