తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5 State Assembly Election 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఆ రోజే! - మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా

5 State Assembly Election 2023 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అక్టోబర్‌ 8 నుంచి 10 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌, డిసెంబర్‌లో పోలింగ్‌ జరగవచ్చని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. డిసెంబర్‌ రెండో వారంలో ఓట్ల లెక్కింపు జరగవచ్చని తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

5 State Assembly Election 2023
5 State Assembly Election 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 2:23 PM IST

5 State Assembly Election 2023 :దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి.

తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. 2018 శాసనసభ ఎన్నికల్లో అలానే నిర్వహించారు. అయితే పోలింగ్‌ తేదీలు మాత్రం 5 రాష్ట్రాలకు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 10 నుంచి 15వ తేదీ మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. మిజోరం శాసనసభ గడువు డిసెంబర్‌ 17తో ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి.

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడం సహా క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపింది.

ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. అలాగే తెలంగాణలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న శాససనభ ఎన్నికలు కావడం వల్ల అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో కాంగ్రెస్ అధికారం ఉంది. ఈ సారి ఎలాగైనా ఆ రెండు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే మధ్యప్రదేశ్​లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్​ను ఓడించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మొదలెట్టేశాయి. మరి ఈ ఐదు రాష్ట్రాలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.

Congress Working Committee Meeting In New Delhi : ఐదు రాష్టాల ఎన్నికలు, కుల గణనపై CWC భేటీ.. అధికారం దక్కించుకునేలా వ్యూహాలు

Sachin Pilot On BJP : 'బీజేపీ పనైపోయింది.. రాజస్థాన్​లో విజయం మాదే.. సీఎం పదవిపై నిర్ణయం అధిష్ఠానానిదే'

Modi In Chhattisgarh : 'కాంగ్రెస్​ పాలనలో అవినీతి, నేరాలు బాగా పెరిగిపోయాయి'.. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వంపై మోదీ ఫైర్​

ABOUT THE AUTHOR

...view details