దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలకు సన్నద్ధమవుతున్న వేళ పాక్ సైన్యం దుస్సాహసానికి ఒడిగట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము కశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల మధ్య పాక్ సైన్యం కాల్పులకు దిగింది. పౌరుల నివాసాలే లక్ష్యంగా మోర్టార్లు, ఇతర ఆయుధాలతో దాడికి దిగింది.
11మంది భారతీయుల వీరమరణం
నియంత్రణ రేఖ వెంబడి దావర్, కేరన్, ఉరీ, నౌగమ్ సెక్టార్లలో మోర్టార్లు, తుపాకులతో పాక్ సైన్యం దుశ్చర్యకు పాల్పడింది. ఈ దాడిలో ఇప్పటివరకు 11 మంది భారతీయులు మృతి చెందారు. వీరిలో ఒక సబ్ఇన్స్పెక్టర్, నలుగురు జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు.
సింహంలా గర్జించిన భారత సైన్యం