తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - లుథియానాలో కారు ప్రమాదం

Ludhiana Accident : ప్రమాదవశాత్తు కారు విద్యుత్​ స్తంభాన్ని ఢీకొనడం వల్ల ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయాలపాలైన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పంజాబ్​లోని లుధియానాలో జరిగింది.

5 people killed and one wounded in car accident in luthiana
5 people killed and one wounded in car accident in luthiana

By

Published : Sep 6, 2022, 4:28 PM IST

Ludhiana Accident : పంజాబ్​లో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు కారు విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. లుధియానాకు చెందిన ఓ కుటుంబం చండీగఢ్​లో ఓ ఫంక్షన్​కు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. ఫోకల్​ పాయింట్ పోలీస్ స్టేషన్​ పరిధిలో కారు అదుపుతప్పి డివైడర్​ను తాకింది. అనంతరం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో అందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

చనిపోయిన వారిని రాజేశ్​ కుమార్​ (40), అతడి కుమార్తె జాస్మిన్ (​5), మరదలు సంజన (30) ఆమె ఇద్దరు కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్​ కుమార్​ భార్య ప్రియ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాజేశ్​.. ప్రతాప్​ కాలనీకి చెందిన ఓ వ్యాపారవేత్త అని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details