తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు బైక్​లు ఢీ.. ఐదుగురు మృతి.. మరొకరు... - ఘోర రోడ్డు ప్రమాదం

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

road accident
ద్విచక్రవాహనాలు ఢీ

By

Published : Oct 28, 2021, 4:13 PM IST

ఝార్ఖండ్​లోని గఢ్​వా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిజోమోరె ప్రాంతం వద్ద జాతీయ రహదారి 343పై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఐదుగురు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం 10:30 సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలోనే ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు రంకా స్టేషన్ అధికారి రామేశ్వర్ ఉపాధ్యాయ తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు రామేశ్వర్.

ఇదీ చూడండి:మహిళా రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు- ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details