తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యంత ఖరీదైన బర్త్​డే పార్టీలు ఇవే! - నవోమీ కాంప్​బెల్

పుట్టినరోజున ఇష్టమైనవాళ్లకు పార్టీ ఇచ్చి గుర్తుండిపోయేలా గడుపుతారు కొందరు. అయితే ఇచ్చినవారే కాదు, తీసుకున్న వాళ్లూ జన్మలో మర్చిపోలేని దావత్​లు ఇవ్వడం కొందరికే సాధ్యం. అలాంటి అత్యంత ఖరీదైన 5 పుట్టినరోజు వేడుకలేంటో చూడండి.

BIRTHDAY
నీతా అంబానీ

By

Published : Jul 23, 2021, 11:01 AM IST

శుభకార్యాలను చాలా మంది ధనవంతులు అంగరంగ వైభవంగా జరుపుతారు. అతిరథమహారథులను ఆహ్వానిస్తారు. సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక వాటి ఖర్చు ఎంతో తెలిస్తే సామాన్యులు నోరెళ్లపెట్టాల్సిందే. పుట్టినరోజుకు వందల కోట్లు ఖర్చు పెట్టినవారూ ఉన్నారు. అలా అత్యంత ఖరీదైన 5 బర్త్​ డే పార్టీలపై ఓ లుక్కేయండి!

  • నీతా అంబానీ- రూ. 223 కోట్లు
    నీతా అంబానీ

నిమిషానికి కోట్లలో సంపాదించే ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ.. 2013లో తన భార్య 50వ పుట్టినరోజుకు అంత ఖర్చు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. అయితే 32 ఛార్టర్డ్​ ఫ్లైట్లలో అతిథులందరినీ వేదిక వద్దకు తీసుకెళ్లడం విశేషం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్​ ఏఆర్​ రెహమాన్​తో సంగీత ప్రదర్శన చేయించారు. జోధ్​పుర్​లోని ఉమైద్ భవన్​ ప్యాలెస్​లో జరిగిన ఈ వేడుకకు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.

  • హసనల్ బోల్కియా- రూ. 202 కోట్లు
    హసనల్ బోల్కియా

బ్రూనై దేశ సుల్తాన్ హసనల్ బోల్కియా 1996లో తన 50వ పుట్టినరోజుకు అప్పటివరకు ఎవ్వరూ చూడని పార్టీని ఇచ్చారు. 2 వారాల పాటు జరిగిన వేడుకలో ప్రిన్స్​ చార్లెస్​తో పోలో మ్యాచ్​, మైకేల్​ జాక్సన్​తో కాన్సర్ట్​ ఏర్పాటు చేశారు. 3 వేల మంది అతిథులకు విందుతో పాటు బంగారు పతకాన్ని అందించారు.

  • మాయావతి- రూ.52 కోట్లు
    మాయావతి

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ జాబితా ఉండటం విశేషం. 2003లో తన 47వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు మాయావతి. 51కిలోల కేక్, లక్ష లడ్డూలు, 60 క్వింటాళ్ల బంతిపూలు, 5వేల బొకేలు సహా ఇంకా ఎన్నో విశేషాలతో ఆ పార్టీ ఓ రేంజ్​లో జరిగింది.

  • స్టీఫెన్ ష్వార్జ్​మన్​- రూ. 37 కోట్లు
    స్టీఫెన్ ష్వార్జ్​మన్

ప్రముఖ వ్యాపారవేత్త, బ్లాక్​స్టోన్​ గ్రూప్​ అధినేత స్టీఫెన్ ష్వార్జ్​మన్​ 60వ పుట్టినరోజున తనకు తానే ఘనంగా పార్టీ ఇచ్చుకున్నారు. న్యూయార్క్​లోని పార్క్ ఎవెన్యూలో మార్చింగ్​ బ్యాండ్​తో అదిరిపోయేలా జరుపుకున్నారు.

  • నవోమీ కాంప్​బెల్- రూ. 13 కోట్లు
    నవోమీ కాంప్​బెల్

ఇక 2006లో సూపర్​ మోడల్ నవోమీ కాంప్​బెల్​ తన పుట్టినరోజుకు ఏకంగా దుబాయ్​లోని బుర్జ్​ అల్ అరబ్ హోటల్​లోని 18వ అంతస్తును పూర్తిగా రెంట్​కు తీసుకుంది. 3 రోజుల పాటు జరిగిన ఈ పార్టీ ఆల్​ వైట్, హిప్​ పాప్, బ్రెజీలియన్ సాంబా అంటూ ఒక్కో రోజు ఒక్కో థీమ్​తో జరిగింది.

ఇదీ చూడండి:'నీతా అంబానీపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవం'

ABOUT THE AUTHOR

...view details