హైవేలపై వెళ్లే భార్యాభర్తలే వారి లక్ష్యం. నిర్మానుష్యంగా, చికటిమయంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని వారిపై దాడి చేసి.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి 15 రోజులకు ఓ చోట ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుసుకుని పోలీసులే నిర్ఘాంతపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ ముఠాకు చెందిన ఐదుగురుని పట్టుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడినట్లు చెప్పారు పోలీసులు. అరెస్టయిన వారి నుంచి గ్యాంగ్ రేప్‌లకు సంబంధించిన ఆరు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
" ప్రతి 10-15 రోజులకు ఓసారి చీకటిగా ఉండే రహదారులను ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నారు. వీడియోల ఆధారంగా వారు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌లో 8 మంది ఉన్నారు. అందులో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారే. వారు కిడ్నాప్‌లు, దోపిడీలకు సైతం పాల్పడుతున్నారు. అరెస్టయిన ఐదుగురిలో ఒకరు మైనర్. పలువురు బాలికలపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ తీసిన వీడియో సైతం అందులో ఉంది. ఈ కేసులో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నాం."
- అమ్రిత్ దుహాన్, ప్రతాప్‌గఢ్ ఎస్పీ.