ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌లో విషాద ఘటన జరిగింది. కొత్వాలిలోని చోటీ గద్రీ ప్రాంతంలో ఓ ఇంటిపైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజమున 3 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఉమాశంకర్, గదియా దంపతులతో సహా వారి ఇద్దరు తనయులు, ఓ కూతురు ఈ ఘటనలో మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిద్రలో ఉండగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.