మేఘాలయ పశ్చిమ జయంతియా హిల్స్ జిల్లాలో దారుణం జరిగింది. 35 మీటర్ల లోతైన బావిలో నిర్మాణ పనులు జరుగుతుండగా.. ప్రమాదవశాత్తు ఐదుగురు మృతి చెందారు. జోవాయి పట్టణ శివారులో ఉన్న ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరిని అధికారులు రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బావిలో పడి ఐదుగురు కూలీలు మృతి - బావిలో పడి ఐదుగురు మృతి
మేఘాలయలోని ఓ లోతైన బావిలో నిర్మాణ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఐదుగురు కూలీలు చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
![బావిలో పడి ఐదుగురు కూలీలు మృతి 5 killed in accident at deep well site in Meghalaya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11207448-thumbnail-3x2-murder.jpg)
బావిలో పడి ఐదుగురు కూలీలు మృతి
ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక రెస్క్యూ బృందం.. ఐదు మృతదేహాలను వెలికి తీసింది. నీరు తోడటానికి ఉపయోగించిన పంపు నుంచి పొగ రావడం వల్ల వారు స్పృహ కోల్పోయి.. బావిలో పడిపోయారని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:మహారాష్ట్ర పోలీసులపై యువకుల దాడి
Last Updated : Mar 30, 2021, 8:04 AM IST