ఉత్తర్ప్రదేశ్ హర్దోయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. భారీ తుపాను ధాటికి మోయినుద్దీన్పుర్లో గోడ కూలి బుధవారం రాత్రి నలుగురు మరణించారు. మృతులను రామేంద్ర(30), రాజేష్(25), గోఖారామ్(28), రామేంద్రలుగా గుర్తించారు పోలీసులు.
ఇసుక తుపాను బీభత్సం- ఐదుగురు మృతి - ఉత్తర్ ప్రదేశ్లో ఇసుక తుపాను
ఉత్తర్ప్రదేశ్ హర్దోయి జిల్లాలో ఇసుక తుపాను ధాటికి ఐదుగురు మరణించారు.
![ఇసుక తుపాను బీభత్సం- ఐదుగురు మృతి storm in UP's Hardoi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11744865-thumbnail-3x2-dd.jpg)
యూపీలో ఇసుక తుపాను
కచౌనా నగరంలో చెట్టుకొమ్మ విరిగి పడి కోమల్(10) అనే బాలిక మృతిచెందిందని హర్దోయి జిల్లా అదనపు కలెక్టర్ సంజయ్ సింగ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి :బిహార్లో పిడుగుల వర్షం- 13 మంది మృతి