రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ట్రక్కును జీప్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.
హర్యానా నుంచి సర్దార్‌షహర్ వైపు వెళ్తున్న జీపు.. భలేరి సమీపంలో ట్రక్కును ఢీకొందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారందరూ దగ్గరి బంధువు అంత్యక్రియలకు బయలుదేరి వెళ్తున్నారు.