రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని కుచామన్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
కుచామన్ పట్టణంలో రాత్రి రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారందరూ చురు జిల్లాలోని రాజల్ దేసర్ అనే గ్రామానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. వారు చురు నుంచి అజ్మీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందిని తెలిపారు.