కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
09:28 May 28
కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని కర్సువా, లోధా గ్రామాల్లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో గ్రామాల్లోని మద్యం దుకాణాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని పోలీసులను, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.