ముంబయిలోని బాంద్రా- ఓర్లి వంతెనపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం వేకువజామున మూడు గంటల సమయంలో ఓ కారు వంతనెపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. క్షతగాత్రుల కోసం అంబులెన్స్ వచ్చింది. అదే మార్గంలో వెళ్తున్న రెండు కార్లలోని వారు.. అక్కడే ఆగి వారికి సాయం అందించారు. ఇంతలో అదే దారిలో అతి వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. పక్కనే పార్క్ చేసిన ఆంబులెన్స్‌ను, ఇతర వాహనాలను ఢీకొట్టింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో బాంద్రా ఓర్లీ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు.