తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహనాలను ఢీ కొట్టిన రైలు- ఐదుగురు మృతి - షహజహాన్​ పుర్ రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో పట్టాలు దాటుతున్న పలు వాహనాలను ఓ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై సీఎం యోగి అదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

5 dead in Shahjahanpur rail accident
ప్రమాద స్థలాని పరిశీలిస్తున్న అధికారులు

By

Published : Apr 22, 2021, 11:53 AM IST

Updated : Apr 22, 2021, 1:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్​లో​ గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న వాహనాల పైకి రైలు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైలు పట్టాలు దాటే ప్రదేశంలో గేట్లు తెరిచి ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి గురైన వాహనం

లఖ్​నవూ- చండీగఢ్​ వెళ్లే సూపర్​ ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్.. మీరన్​పుర్​ కట్ర రైల్వే స్టేషన్ దాటిన తర్వాత.. పట్టాలు దాటుతున్న రెండు ట్రక్కులు, ఓ కారు, రెండు బైక్​లను ఢీ కొట్టింది. ఆ తర్వాత రైలు పట్టాలు తప్పిందని స్థానిక ఎస్పీ సంజీవ్​ బాజ్​పాయ్ చెప్పారు.

ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు వస్తున్న సమయంలో గేట్లు ఎలా తెరుచుకున్నాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ప్రమాద స్థలాని పరిశీలిస్తున్న అధికారులు

సీఎం సంతాపం..

ప్రమాద ఘటనపై సీఎం యోగి అదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

ఇదీ చదవండి:బాధ్యతారాహిత్యం.. భరోసానివ్వని ప్రభుత్వం!

ఇదీ చదవండి:ప్రముఖ మతగురువు కన్నుమూత- మోదీ సంతాపం

Last Updated : Apr 22, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details