ఐదుగురు యువకులు.. 16 ఏళ్ల బాలికపై 6 నెలలపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో జరిగింది. ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే?

మధ్యప్రదేశ్, జబల్‌పుర్‌కు చెందిన బాలికపై.. ఆమె స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను స్నేహితులకు పంపించాడు. దీంతో వీడియోను వైరల్ చేస్తామని భయపెట్టి ఐదుగురు కలిసి బాలికను బెదిరించి 6 నెలలపాటు అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని, వీడియో బయటపెడతామని హెచ్చరించారు.
అయితే.. జరిగిన విషయాన్ని బాలిక.. తల్లితండ్రులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి.. వారిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:కాలకృత్యాలకు వెళ్లిన బాలికపై హత్యాచారం!