జమ్ముకశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 34 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం మీద 50.08శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటింగ్ వేళ.. బాజల్తా, బుద్గాం, బుధాల్, మంజాకోట్లోని అనేక పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడాయి.
అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. అదే సమయంలో కొవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారి ఉష్ణోగ్రతను సరిచూసిన తర్వాతే లోపలకు పంపించారు.