బంగాల్ కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. మహిళ కడుపులో నుంచి 46 కిలోల కణితిని తొలగించారు. ఐదు నెలల క్రితం జరిగిన వైద్యులు ఈ శస్త్రచికిత్స చేయగా.. రోగి ఇప్పటికి పూర్తిగా కోలుకుందని వైద్యులు తెలిపారు.
మహిళకు అరుదైన శస్త్రచికిత్స.. 46 కిలోల కణితి తొలగింపు.. 5నెలల తర్వాత.. - బంగాల్ ఠాకూర్పుకూర్ క్యాన్సర్ వైద్యులు
బంగాల్లోని ఓ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మహిళ కడుపులో నుంచి 46 కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
"ఆస్పత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి విషమంగా ఉంది. మెల్లగా చికిత్సను ప్రారంభించాం. మహిళకు సీటీ స్కాన్ చేశాం. అందులో పెద్ద కణితి కనిపించింది. ఆ తర్వాత ఆరుగురు వైద్యులు బృందంగా ఏర్పడి ఆపరేషన్ నిర్వహించి 46 కిలోల కణితిని తొలగించాం. రోగి బరువు 50 కిలోలే అయినప్పటికి కణితి వల్ల దాదాపు 100 కిలోల బరువు ఉండేది. అందుకే ఆమె కడుపునొప్పితో బాధపడేది. నడవడానికి కూడా ఇబ్బందిపడేది. ఆమె కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఈ ఏడాది జూలైలో ఆపరేషన్ చేశాం. సర్జరీకి రెండు గంటల సమయం పట్టింది. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచిన తర్వాత డిశ్చార్డ్ చేశాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. నడవగలుగుతోంది."
--సుబ్రత్ షా, సర్జికల్ ఆంకాలజిస్ట్