దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 45,209 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 501 మంది మహమ్మారికి బలయ్యారు.
మొత్తం కేసులు: 90,95,807
మొత్తం మరణాలు: 1,33,227
దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ నిలకడగా పెరుగుతున్నాయి. కొత్తగా 45,209 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 501 మంది మహమ్మారికి బలయ్యారు.
మొత్తం కేసులు: 90,95,807
మొత్తం మరణాలు: 1,33,227
మొత్తం కోలుకున్నవారు: 85,21,617
దేశంలో కరోనా కేసుల కన్నా కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల యాక్టివ్ కేసుల్లో తగ్గుదల నమోదవుతోంది. ఫలితంగా క్రీయాశీలక కేసుల సంఖ్యలో క్షీణత కనిపిస్తుంది. తాజాగా 43,493 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
శనివారం ఒక్కరోజే 10,75,326 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 13 కోట్ల 17 లక్షల 33 వేలు దాటింది.
ఇదీ చూడండి:మాజీ సైన్యాధికారి ఆర్ఎన్ చిబ్బర్ కన్నుమూత