తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 44,643 కరోనా కేసులు

దేశంలో తాజాగా 44,643 మందికి కరోనా సోకింది. వైరస్​తో మరో 464 మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid cases
కరోనా కేసులు

By

Published : Aug 6, 2021, 9:35 AM IST

Updated : Aug 6, 2021, 10:09 AM IST

దేశంలో కరోనా కేసులు గురువారంతో పోలిస్తే పెరిగాయి. కొత్తగా 44,643 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 464 మంది మరణించారు. తాజాగా 41,096 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు:3,18,56,757

మొత్తం మరణాలు:4,26,754

కోలుకున్నవారు:3,10,15,844

యాక్టివ్​ కేసులు:4,14,159

టీకాల పంపిణీ

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 49,53,27,595 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం కొత్తగా 57,97,808 డోసులు అందించినట్లు పేర్కొంది.

వివిధ రాష్ట్రాల్లో కేసులు..

కేరళలో కొత్తగా 22,040 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 117 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కొత్తగా 6,695 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 120 మంది మరణించారు.

తమిళనాడులో 1,997 కరోనా కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 33 మంది బలయ్యారు.

కర్ణాటకలో కొత్తగా 1,785 కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒడిశాలో కొత్తగా 1,342 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 68 మంది చనిపోయారు.

మిజోరంలో 1,088 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా.. 684 మంది కోలుకున్నారు. వైరస్ ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

​గుజరాత్​లో మరో 102 మందికి కరోనా సోకినట్లు తేలగా.. రాజస్థాన్​లో 40 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

మణిపుర్​లో కొత్తగా 757 మందికి కరోనా సోకింది. 1,078 మంది కోలుకోగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:కరోనా వేళ.. జీవన హక్కుకు హామీ లభించేనా?

Last Updated : Aug 6, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details