దేశంలో 44 శాతం మంది గ్రామీణులు కరోనా వ్యాక్సిన్ కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు.. గ్రామీణ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ సర్వేని నిర్వహించగా ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 60 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 36 శాతం మంది తాము కరోనా టీకా కోసం డబ్బు చెల్లించబోమని తెలపగా... 20 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
టీకా కొనుగోలుకు డబ్బు చెల్లించే వారిలో మూడింట రెండొంతుల మంది.. వ్యాక్సిన్ రెండు మోతాదులకు 500 రూపాయల వరకు ఖర్చు చేస్తామని తెలిపారు.