Chhattisgarh Naxals surrender: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 44 మంది నక్సల్స్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా చింతాల్నార్స కిష్టారామ్, భేజీ ప్రాంతాల్లో.. కింది స్థాయి క్యాడర్లుగా పనిచేస్తున్నారని సుక్మా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. కరిగుండం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంప్ వద్ద వీరు సరెండర్ అయ్యారని చెప్పారు. పోలీసు క్యాంపునకు వచ్చే సమయంలో భారీ సంఖ్యలో గ్రామస్థులు మావోయిస్టుల వెంట వెళ్లారు.
44 మంది నక్సల్స్ లొంగుబాటు- ఒకరిపై రూ.2 లక్షల రివార్డు
Naxals surrender in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు భారీ విజయం! 44 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. సుక్మా జిల్లాలోని ఓ పోలీస్ క్యాంప్‌లో వీరు లొంగిపోయారు.
naxals surrender
లొంగిపోయిన మావోయిస్టుల్లో మాద్కమ్ దుల సైతం ఉన్నాడని సునీల్ శర్మ తెలిపారు. అతడిపై రూ.2 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. మావోయిస్టు భావజాలంతో విసిగిపోయి తాము బయటకు వచ్చామని నక్సల్స్ పేర్కొన్నట్లు వివరించారు. జిల్లా పోలీసుల పునరావాస చర్యలకు ముగ్ధులయ్యామని నక్సల్ల్ చెప్పారని సునీల్ శర్మ పేర్కొన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు భోజనాలు వడ్డించారు అధికారులు.
ఇదీ చదవండి:దిల్లీ, మహారాష్ట్రలో కరోనా విలయం- రాష్ట్రాలకు కేంద్రం లేఖ
Last Updated : Jan 1, 2022, 10:51 PM IST