కేంద్ర మంత్రుల రాజీనామా- రాష్ట్రపతి ఆమోదం..
- 12 మంది కేంద్రమంత్రులు, సహాయమంత్రుల రాజీనామాలు ఆమోదం
- రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
17:38 July 07
కేంద్ర మంత్రుల రాజీనామా- రాష్ట్రపతి ఆమోదం..
17:32 July 07
రవిశంకర్ ప్రసాద్, జావడేకర్కు ఉద్వాసన..
కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, జావడేకర్కు కూడా మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఇరువురూ కేంద్ర మంత్రులుగా రాజీనామా చేశారు.
మొత్తం 12 మంది మంత్రులు రాజీనామా చేశారు.
16:09 July 07
43 మంది కేంద్ర మంత్రులు వీరే!
మంత్రి వర్గ విస్తరణలో భాగంగా.. ప్రమాణ స్వీకారం చేసే 43 మంది నేతల పేర్లు వెలువడ్డాయి. జోతిరాదిత్య సింధియా, పశుపతి పరాస్, భూపేందర్ యాదవ్, అనుప్రియ పటేల్, మీనాక్షీ లేఖీ, అజయ్ భట్, అనురాగ్ ఠాకూర్లు ఉన్నారు.
13:31 July 07
మంత్రివర్గ విస్తరణపై కీలక విషయాలు లీక్- కొత్తగా 43 మంది...
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏకంగా 43 మందిని మంత్రిమండలిలో చేర్చుకోనున్నారు. వీరంతా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు దిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎంపీలతో మోదీ భేటీ..
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు.. భాజపా ఎంపీలతో లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
రాజీనామాలు..
ప్రస్తుతమున్న మంత్రుల్లో అనేక మందిని మోదీ కేబినెట్ నుంచి తప్పించనున్నారు. ఇప్పటికే కేంద్ర థావర్‌చంద్ గహ్లోత్‌కు గవర్నర్‌గా అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రులు సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్, హర్షవర్ధన్, సంజయ్ దోత్రే, బాబుల్ సుప్రియో తమ పదవులకు రాజీనామా చేశారు.
వారికి ఆహ్వానం..
కొత్తగా మంత్రివర్గంలో చేరనున్న నేతలు ప్రధాని నివాసానికి రావాలని ఆహ్వానం అందింది. వారంతా దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని మోదీ ఇంటికి వెళ్లి... ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
మోదీ ఇంటికి వెళ్లిన నేతలు వీరే...