తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'త్రివిధ దళాల్లో 42 వేల మందికి కరోనా' - త్రివిధ దళాలు కరోనా

త్రివిధ దళాల్లో మొత్తం 42 వేల మంది కరోనా బారిన పడ్డారని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. సైన్యంలో 32 వేలు, ఎయిర్​ఫోర్స్​లో 6,544, నేవీలో 3,604 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందని రాజ్యసభకు వెల్లడించారు.

RSQ ARMY COVID
త్రివిధ దళాల్లో 42 వేల మందికి కరోనా

By

Published : Mar 9, 2021, 5:35 AM IST

దేశంలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మొత్తం 42,848 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారని రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

భారత సైన్యంలో 32,690 మందికి కరోనా సోకగా మరణాల రేటు 0.24 శాతంగా ఉందని తెలిపారు. వాయు సేనలో 6,554 కేసులు నమోదు కాగా, మరణాల రేటు 0.39 శాతంగా ఉందన్నారు. నావికా దళంలో 3,604 మందికి కరోనా సోకగా మరణాల రేటు 0.05 శాతంగా ఉందని వెల్లడించారు.

ఏవైనా అంటువ్యాధుల కారణంగా సర్వీసులో ఉన్న సాయుధ దళ సిబ్బంది మరణిస్తే నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి ప్రత్యేక పరిహారం అందించబోమని మంత్రి తెలిపారు. ఇతర అన్ని పరిహారాలూ వారికి అందిస్తామని ఆయన రాజ్యసభలో వెల్లడించారు.

ఇదీ చదవండి:మట్టిదిబ్బ కూలి నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details