Drug destruction day: మాదక ద్రవ్యాల విధ్వంస దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 14 ప్రదేశాలలో స్వాధీనం చేసుకున్న 44 వేల కిలోల మాదక ద్రవ్యాలను.. కస్టమ్స్ విభాగం C.B.I.C బుధవారం దహనం చేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర‌్మలా సీతారామన్ ఆధ్వర్యంలో.. ఈ దహనం జరిగింది. దీనికోసం ముందుగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి ఆమోదం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా 42,000 కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం
Drug destruction: డ్రగ్ డిస్ట్రక్షన్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో 42వేల కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. దీనికోసం ముందుగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి ఆమోదం తీసుకున్నారు అధికారులు.
దేశవ్యాప్తంగా 42,000 కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం
డ్రగ్స్ దహనాన్ని సురక్షితంగా, ప్రమాదరహిత పద్ధతిలో చేశారు. ఈ ప్రక్రియ గుజరాత్‌లోని కచ్, మహారాష్ట్రలోని ముంబయి, పుణె, తమిళనాడులోని విరుదునగర్, బిహార్‌లోని పట్నా, బంగాల్‌లోని సిలిగుడితో సహా మొత్తం 14 ప్రదేశాల్లో జరిగింది. ఉత్తర్ప్రదేశ్లో 2,871 కిలోల గంజాయి, 146 కేజీల చరాస్ను మాదకద్రవ్యాల విధ్వంస దినోత్సవం సందర్భంగా ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి:ఈడీ ముందుకు సోనియా, రాహుల్.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ ప్రణాళిక!