బిహార్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు.. తన క్లాస్‌కు వచ్చిన విద్యార్థినిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోచింగ్ సెంటర్లో చిగురించిన ప్రేమ.. గుడిలో పెళ్లి చేసుకున్న టీచర్, స్టూడెంట్
ఓ కోచింగ్ సెంటర్లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తెచ్చింది ఆ జంట. కానీ ఇది ఇద్దరు విద్యార్థుల ప్రేమ కథ కాదు. ఓ స్టూడెంట్ టీచర్ లవ్‌స్టోరీ.
రోస్డా బజార్లో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్‌ను సంగీత్ కుమార్(42) అనే ఓ ఉపాధ్యాయుడు నడుపుతున్నాడు. ఇంగ్లీష్ క్లాసులను చక్కగా చెబుతున్నాడు. అయితే ఆ కోచింగ్ సెంటర్‌కు శ్వేతా కుమారి(20) అనే యువతి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొన్నిరోజుల క్రితం వచ్చింది. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా వారి ప్రేమ.. పెళ్లి వరకు దారి తీసింది.
తాజాగా వీరిద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారు. స్నేహితులు, బంధువుల మధ్య థానేశ్వర్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మ్యారేజ్‌ను రిజిస్టర్ ఆఫీస్‌లో నమోదు కూడా చేసుకున్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడి భార్య కొన్నేళ్ల క్రితం మరణించిందని సమాచారం. విద్యార్థినితో ఆయనది రెండో పెళ్లి అని తెలిసింది.