తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Heroin Seized: రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత - అమృత్​సర్ న్యూస్

భారత్‌-పాక్‌ సరిహద్దు సమీపంలో భారీఎత్తున మాదకద్రవ్యాలను(narcotics seized) పంజాబ్‌ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి అంతర్జాతీయ సరిహద్దు ద్వారా తరలిస్తున్న 40కిలోల హెరాయిన్‌ను(Heroin) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

heroin
హెరాయిన్

By

Published : Aug 22, 2021, 5:00 AM IST

Updated : Aug 22, 2021, 6:33 AM IST

అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను(Heroin) పంజాబ్‌ పోలీసులు స్వాధీనం(narcotics seized) చేసుకున్నారు. భారత్‌- పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పంజ్‌గ్రెయిన్‌ ప్రాంతంలో పంజాబ్‌ పోలీసులు, సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) సంయుక్త ఆపరేషన్‌లో 40కిలోలకు పైగా హెరాయిన్‌ను పట్టుకున్నారు.

హెరాయిన్ పట్టుకున్న పంజాబ్ పోలీసులు

దీనిపై అమృత్‌సర్‌ గ్రామీణ సీనియర్‌ ఎస్పీ గుల్‌నీత్‌ సింగ్‌ ఖురానా మాట్లాడుతూ.. కరడుగట్టిన స్మగ్లర్‌ నిర్మల్‌ సింగ్‌, అమృత్‌సర్‌కు చెందిన ఓ వ్యక్తి కలిసి పాక్‌ నుంచి భారీగా హెరాయిన్‌ తరలిస్తున్నట్టు(Drug trafficking) తమకు సమాచారం అందిందన్నారు. ఈ సమాచారం బీఎస్‌ఎఫ్‌తో పంచుకొని సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి 39 ప్యాకెట్లలో ఉన్న దాదాపు 40 కిలోలకు పైగా హెరాయిన్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు. పాక్‌కు చెందిన స్మగ్లర్ల మాదక ద్రవ్యాల రవాణాను భగ్నం చేసినట్టు చెప్పారు.

పంజాబ్‌ పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కలిసి విజయవంతంగా మాదకద్రవ్యాలను సీజ్‌ చేశారని డీజీపీ దిన్‌కర్‌ గుప్తా అన్నారు. పోలీసులు సీజ్‌ చేసిన వాటిలో హెరాయిన్‌తో పాటు 180 గ్రాముల ఒపియం, పాక్‌లో తయారైన రెండు ప్లాస్టిక్‌ పైపులు కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి:జిమ్​లో సీఎం వర్క్​అవుట్లు.. వీడియో వైరల్​

Last Updated : Aug 22, 2021, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details