బంగాల్లోని అసన్సోల్ కోర్టులో ఆదివారం అర్థరాత్రి దుండగులు డోర్ తాళాలు పగలగొట్టి అల్మారాల్లో ఉన్న 400 ఫైళ్లు చోరీ చేశారు. అసన్సోల్ కోర్టు ప్రాంగణంలో ఉన్న మొదటి మున్సిఫ్ కోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కోర్టుకు చెందిన హెడ్ క్లర్క్ అరూప్ దాస్, పేష్కర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కోర్టు అల్మారాలో ఉన్న 400 ఫైళ్లు మాయం.. చోరీనా? లేక కుట్రనా? - అసన్సోల్ కోర్టులో 400 ఫైళ్లు చోరీకి గురయ్యాయి
కోర్టు అల్మారాలో ఉన్న 400 ఫైళ్లు చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు. బంగాల్లో వెలుగుచూసిందీ ఘటన.

కోర్టు
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న మిగతా ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో విచారించేందుకు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన కొన్ని ఫైళ్లను అసన్సోల్ చర్చి యార్డ్‌లో పాత పేపర్లు అమ్ముతున్న వ్యాపారి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దొంగతనం కేవలం కాగితాల అమ్మకం కోసమేనా లేదా ఏదైనా కుట్రలో భాగంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి:
- ఘోర ప్రమాదం.. బస్సు, లారీ ఢీ... నలుగురు మృతి