ఉత్తర్‌ప్రదేశ్‌లో (Up Rape News) మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కౌశాంబీ జిల్లాలోని కరారీలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ టీనేజర్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనుకోకుండా బాలిక.. నిందితుడి ఇంటికి వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. పరారీలో నిందితుడు! - చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు
అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇంటి పక్కన ఉండే ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Up Rape News) కౌశాంబీలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారిపై అత్యాచారం
బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు పోలీసులు.