తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు ప్రపంచ రికార్డులు ఆ హైవే సొంతం! - ప్రపంచ రికార్డులు సాధించిన వడోదరా-భరూచ్‌ రహదారి

రికార్డు సమయంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పలు వంతెనలు, రహదారుల గురించి చదివినప్పుడు అరే భలే పూర్తి చేశారే అనిపిస్తుంటుంది. వందలమంది కార్మికులు ఏకకాలంలో చేసే శ్రమకు గుర్తింపుగా ఇవి నిలుస్తాయి. మరికొన్ని సార్లు రికార్డులూ దాసోహమవుతాయి. అలానే ఒక్కరోజులో నిర్మాణం పూర్తి చేసుకున్న వడోదరా-భరూచ్‌ రహదారి ప్రపంచ రికార్డులకెక్కింది.

4 World Records of Vadodara-Mumbai Expressway: 2 km long highway completed in 24 hours
4 ప్రపంచ రికార్డులు ఆ హైవే సొంతం!

By

Published : Feb 4, 2021, 9:33 AM IST

అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయిన హైవేగా వడోదరా-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేలో అంతర్భాగమైన వడోదరా-భరూచ్‌ రహదారికి ఏకంగా నాలుగు ప్రపంచ రికార్డులు దక్కాయి. 2 కి.మీ.ల పొడవు, 18.75 మీటర్ల వెడల్పున్న ఈ హైవే నిర్మాణాన్ని మంగళవారం 24 గంటల్లోనే పూర్తి చేయడం విశేషం. వందలమంది కార్మికులు, భారీ యంత్రాలతో ఈ ఫీట్​ను సాధించారు.

అన్నీ రికార్డులే..

ఈ నిర్మాణంలో 5.5 వేల టన్నుల సిమెంటు, 500 టన్నుల ఐస్‌ను వినియోగించారు. రూ.3 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. 24 గంటల్లో ఉత్పత్తి చేసిన, వినియోగించిన కాంక్రీటు గరిష్ఠ పరిమాణం సహా.. నిరంతరాయంగా 18.75 మీటర్ల వెడల్పులో పరచిన కాంక్రీటు(24గంటల్లో), పరచిన ప్రదేశ విస్తీర్ణం అంశాల కింద దీనికి రికార్డులు లభించాయి.

ఇంజనీర్లు, కార్మికుల పరస్పర సహకారం.. నిర్వహణలోని ఉన్న అడ్డంకులను అధిగమించడం వల్లే రికార్డు స్థాయిలో నిర్మాణం సాధ్యమైందని 'పటేల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్'​ వెల్లడించింది.

ఇదీ చదవండి:మరుగుదొడ్డిలో చిరుత, శునకం.. వీడియో వైరల్​!

ABOUT THE AUTHOR

...view details