ఉత్తర్‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్లనాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్ సింగ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా పురాతన ఆయుధాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. దాదాపు 77 రాగి వస్తువులను స్వాధీనం చేసుకుని.. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేసింది. అక్కడ రాగి నిధులతోపాటు, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు.
పొలం చదును చేస్తుండగా బయటపడ్డ 4000 ఏళ్లనాటి ఆయుధాలు - పురాతన ఆయుధాలు లభ్యం
ఉత్తర్‌ప్రదేశ్‌లో పురాతన వస్తువులు, ఆయుధాలు బయటపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన పురావస్తు శాస్త్రవేత్తలు అవి 4 వేల ఏళ్ల నాటివని ప్రాథమికంగా గుర్తించారు. చాల్కోలిథిక్ కాలంలో అక్కడ ప్రజలు నివసించేవారని.. ఆ ప్రాంతంలో సైనికుల శిబిరం ఉండేదని చెబుతున్నారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
పురాతన కాలంలో రుషులు మెయిన్‌పురి ప్రాంతంలో తపస్సు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. మెయిన్‌పురిలో తొమ్మిది, పదో శతాబ్దానికి చెందిన పురాతన వస్తువులను ఇప్పటికే గుర్తించారు. అప్పటినుంచి చాల్కోలిథిక్ యుగంలో మెయిన్‌పురిలో ప్రజలు జీవించి ఉన్నారన్న వాదనలకు బలం చేకూరింది.
ఇదీ చదవండి:భద్రత ప్రమాణాలు లేకుండా మైనింగ్.. పొక్లైన్లో మంటలొచ్చి ఆపరేటర్ మృతి