కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు కుట్రను భగ్నం చేసే క్రమంలో మరో జవాన్ వీరమరణం పొందాడు. మాచిల్ సెక్టర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించగా.. వారిని ఎదుర్కొనే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఓ ఆర్మీ అధికారి, ముగ్గురు సైనికులు, ఓ బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు.
'చొరబాటు కుట్ర భగ్నం'లో మరో జవాను వీరమరణం - కశ్మీర్ ఎన్కౌంటర్లో అమరుడైన మరో జవాన్
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు కుట్రను భగ్నం చేసే క్రమంలో మరో సైనికుడు అమరుడయ్యాడు. కుప్వారా జిల్లాలోని మాచిల్ నియంత్రణ రేఖ వెంబడి ఈ ఘటన జరిగింది. సైన్యానికి చెందిన వారిలో మొత్తం నలుగురు ప్రాణాలు విడిచారు. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను హతమర్చాయి భద్రతా బలగాలు.
కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రభగ్నం- అమరుడైన మరో జవాన్
ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలో శనివారం అర్ధరాత్రి వేళల్లో ఉగ్రవాదులు.. భారత భూ భాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారి కదలికల్ని పసిగట్టిన బలగాలు.. అప్రమత్తమై ప్రతిఘటించాయి. ఈ ఆపరేషన్లో ముగ్గురు ముష్కరులను హతమార్చింది భారత సైన్యం. అనంతరం వారి నుంచి 2 ఏకే రైఫిళ్లు, 2 పిస్టళ్లు, ఇతర ఆయుధాలు సహా.. ఓ రేడియో, రూ. 50వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సైన్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:మాజీ ఎస్సైకు కడుపు నిండాలంటే.. చెత్త ఏరాల్సిందే!
Last Updated : Nov 8, 2020, 11:35 PM IST