ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా దుముడా గ్రామంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి కొడుకులు లేకపోవడం వల్ల దివ్యాంగులైన నలుగురు కుమార్తెలే పాడి మోసి.. అంత్యక్రియలు నిర్వహించారు.
నిజాంపుర్ పంచాయత్ దుముడా గ్రామానికి చెందిన బైధార్ జేనా నలుగురు కుమార్తెలకు వినికిడి లోపం ఉంది. ఈ కారణంగా వారికి వివాహం కూడా జరగలేదు. తండ్రి ఆధారంతోనే వారు జీవనం సాగిస్తున్నారు. గతకొంత కాలంగా బైధార్ అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల అతని భార్య హర్మానీ జేనా కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంది. కానీ ఆరునెలల క్రితమే ఆమె మృతిచెందింది.