ఝార్ఖండ్‌లో రైలు ఢీకొట్టిన(train accident) ఘటనలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందారు. సింగ్‌భూమ్ జిల్లా బింజాయ్ పులియా ప్రాంతంలో.. ఓ మహిళ తన కుమారుడు, కోడలు, మనవరాలితో కలిసి.. పట్టాలు దాటేందుకు యత్నించింది. ఈ క్రమంలో అటుగా వేగంగా వస్తున్న.. దురంతో ఎక్స్‌ప్రెస్ వారిని ఢీ కొట్టింది. అమాంతం ఎగిరి పడిన ఆ నలుగురు వ్యక్తులు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పట్టాలపై మృత దేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం వల్ల ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది.
రైలు ఢీకొని ఒకే కుటుంబంలో నలుగురు మృతి - సింగభూమ్ రైలు ప్రమాదం
పట్టాలు దాటేందుకు యత్నించగా రైలు ఢీకొని(train accident) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో జరిగింది.
రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
పని ముగించుకొని ఇంటికి త్వరగా వెళ్లే క్రమంలో.. వారు పట్టాలు దాటేందుకు యత్నించారని రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆర్‌పీఎఫ్ అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :అగ్గిపెట్టెకన్నా చిన్న ఖురాన్‌ను ఎప్పుడైనా చూశారా?