తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి నలుగురు మృతి - poisonous liquor news

4 people die in Bhilwara due to poisonous drinking, 5 in critical condition
కల్తీ మద్యం తాగి నలుగురు మృతి

By

Published : Jan 29, 2021, 8:41 AM IST

Updated : Jan 29, 2021, 9:40 AM IST

08:35 January 29

కల్తీ మద్యం తాగి నలుగురు మృతి

రాజస్థాన్ భీల్వాడా జిల్లా మాండల్​గఢ్​ పరిధిలోని ఖేడా గ్రామంలో కల్తీమద్యం తాగి ఓ మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి భీల్వాడాలోని మహాత్మా గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకుంది. అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

భరత్​పుర్​లో కల్తీ మద్యానికి ఏడుగురు బలైన ఘటన మరువక ముందే భీల్వాడాలో ఈ ఘటన జరగడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కల్తీ మద్యం మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Last Updated : Jan 29, 2021, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details