తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నది ఒడ్డున బట్టలు, సైకిళ్లు.. ఏంటా అని చూస్తే ఆ ముగ్గురు శవాలై... - odisha telugu news

స్నానం చేయడానికి మహానదికి (Mahanadi river) వెళ్లిన విద్యార్థులు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. ముగ్గురు మృతదేహాలను వెలికితీయగా.. మరొకరి ఆచూకీ గల్లంతైంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Mahanadi river
Mahanadi river, మహానది, విద్యార్థుల దుర్మరణం

By

Published : Nov 26, 2021, 12:43 PM IST

ఒడిశా కటక్​లో విషాదం చోటుచేసుకుంది. మహానదిలో (Mahanadi news today) స్నానానికి వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి ఆచూకీ గల్లంతైంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల్ని కటక్​లోని పోటాపొఖారి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను ఎస్​సీబీ వైద్య కళాశాలకు తరలించారు.

ఇదీ జరిగింది..

8వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. స్నానం చేసేందుకు ఉడిములా ఘాట్​కు చేరుకున్నారు.

ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాకపోగా.. కుటుంబ సభ్యులు నది దగ్గరకు వెళ్లారు. అక్కడే ఒడ్డున సైకిళ్లు, దుస్తులు ఉండటం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

నది ఒడ్డున విద్యార్థుల దుస్తులు, చెప్పులు, సైకిళ్లు

ఘటనా స్థలానికి చేరుకున్న ఒడిశా(Odisha news) విపత్తు ప్రతిస్పందన దళం(ఓడీఆర్​ఎఫ్​) సిబ్బంది.. విద్యార్థుల మృతదేహాలను బయటకుతీశారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు.

విద్యార్థుల మరణంతో.. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

విద్యార్థుల మరణంతో గ్రామంలో విషాదం

ఇదీ చూడండి: Constitution Day 2021: 'ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శకం'

ABOUT THE AUTHOR

...view details